మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మరియు శ్రీరాములు అందెల
మహేశ్వరం నియోజకవర్గ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కి బాత్ కార్యక్రమాన్ని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారితో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మోదీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవ విశేషాలను దేశ ప్రజలతో పంచుకున్నారు…ప్రపంచ దేశాల్లో యోగా ప్రదర్శనలు జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ గిరిజన బిడ్డలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి చిరుధాన్యాలతో బిస్కెట్లు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని…వీరి విజయం దేశంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గడ్డం లక్ష్మా రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, దడిగ శంకర్, గూడెపు ఇంద్రసేన, బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రామ్ రెడ్డి, రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు లాలా సందీప్, రేసు నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.