December 24, 2025

4 లేబర్ కోడ్స్ రద్దుకై జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు

0
WhatsApp Image 2025-06-29 at 07.01.31_59937ccd

ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయాలని ధర్నా చేసి అనంతరం వినతి పత్రం, సమ్మె నోటీస్ జిల్లా కలెక్టర్ AO గారికి అందజేత నిర్మల్ జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేద్దాం అని సమ్మె నోటీసు కలెక్టర్ AO, గారికి అదేవిధంగా DPO కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ గారికి సమ్మె నోటీస్ అందజేత చేశారు.ఈ సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేష్ మాట్లాడుతూ… నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు 3 నెల నుంచి 6నెల జీతం పెండింగ్ లో ఉన్నాయి వెంటనే విడుదల చేయాలి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు ఒకటో తారీకు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన తప్ప నేటికీ అమలు కావడం లేదు, చాలీచాలని జీతంతోని కార్మికులు కాలం, మురికి కాలంలో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందన్నారు. 1991 తర్వాత దేశంలో అమలు జరిపిన నూతన ఆర్థిక విధానాలు, ముఖ్యంగా 2014 సం. తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను వేగవంతంగా అమలు చేస్తూ… పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ట ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేందుకే ఈ నాలుగు లేబర్ కోడులను తెచ్చిందన్నారు.

వేతనాల కోడ్ ను 2019లో పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నది. మిగతా 3 కోడ్స్ పారిశ్రామిక వివాదాల కోడ్, సామాజిక భద్రత కోడ్, విధి నిర్వహణలో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లను 2020 సెప్టెంబర్లో ఎటువంటి చర్చకు అవకాశమివ్వకుండా బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశంగా లేబర్ కోడ్లను ఆమోదింపజేసుకున్నది. ప్రజలంతా కరోనా కల్లోలంతో తల్లడిల్లుతున్న సమయంలో బిజెపి సర్కారు ఈ విద్రోహ చర్యకు పాల్పడిందన్నారు.
1991 నుండి సరళీకృత విధానాలను ప్రతిఘటించేందుకు ఇప్పటివరకు దేశంలో కార్మికవర్గం 21 సార్వత్రిక సమ్మెలతో సహా అనేక ఉద్యమాలు చేసిందని, ఇప్పుడు కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరించే నయా ఉదారవాద విధానాలను ప్రతిఘటిస్తూ అప్రజాస్వామికంగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకై 2025 జులై 9 న కార్మికవర్గం మరో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమైందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులలో పనిచేస్తున కార్మికులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు పూర్తిగా హరిచిపోతున్నాయి .కాబట్టి ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

ట్రేడ్ యూనియన్స్ చట్టం-1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) 1946, పారిశ్రామిక వివాదాల చట్టం-1947 ఈ మూడు చట్టాలు రద్దు చేసి ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్ రూపొందించారు. ఈ కోడ్ అమలులోకి వస్తే పాత మూడు చట్టాలు రద్దవుతాయి. ఈ కోడ్ “ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్”ను చట్టబద్ధం చేసింది. పర్మినెంటు ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థని నెలకొల్పటానికి బాటలు వేసింది. రెగ్యులర్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చింది.
వాజ్పాయ్ ప్రభుత్వం 2003లోనే “ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్” పద్ధతిని చట్టం చేయకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమలులోకి తెచ్చింది. ఆ తరువాత 2004లో వామపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన యుపిఏ-1 ప్రభుత్వం కార్మిక సంఘాల పోరాటాలు, వామపక్ష పార్టీల ఒత్తిడితో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 2018లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ‘ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ంట్”ను ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ద్వారా దానికి చట్టబద్ధత కల్పించిందన్నారు.

వేతనాల కోడ్: వేతనాల చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపు చట్టం, 1965, సమాన వేతన చట్టం, 1976 ఈ 4 చట్టాల స్థానంలో వేతనాల కోడ్-2019ని రూపొందించారు. ఈ కోడ్ అమలులోకి వస్తే పాత 4 చట్టాలు రద్దవుతాయన్నారు.
కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం జిల్లాలోని సంఘటిత అసంఘటిత కార్మికులు
2025 జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నర్సయ్య, ఉపాధ్యక్షుడు బి.రవి, G.మల్లేష్, నాయకులు నరసయ్య, మొగిలి, రాజేందర్, భూమన్న, వనిత, బుర్రవ, తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed