February 22, 2026
IMG-20260111-WA1067

రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు బిజెపి ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా ‘మన ఊరి న్యూస్’
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

రాజేంద్రనగర్, జనవరి 11: రాజేంద్రనగర్ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ బిజెపి ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మన ఊరి న్యూస్’ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ, సమాజానికి నిజాయితీ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను అందిస్తూ ‘మన ఊరి న్యూస్’ తెలుగు దినపత్రిక అద్భుతమైన సర్కులేషన్ తో ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య
మనుగడకు, సమాజాభివృద్ధికి వార్తాపత్రికల పాత్ర అపారమైనదని, బడుగు, బలహీన, పీడిత వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేయాలని సూచించారు తోకల శ్రీనివాస్ రెడ్డి. ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా సమాచారం, విశ్లేషణలతో సమాజాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరి న్యూస్’ కృషి చేయాలని ఆకాంక్షించారు. ‘మన ఊరి న్యూస్’ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎడిటర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, పత్రిక యొక్క దృక్పథం, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ప్రారంభ సంవత్సరం లోనే ఐదు లక్షల డిజిటల్ సర్కులేషన్ సాధించినట్టు తెలిపారు. అతి త్వరలో ఒక మిలియన్ మైలురాయిని దాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మని, పాఠకులు, శ్రేయోభిలాషుల సహకారంతో దీన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిహెచ్ ప్రభుదాసు, గోదా పాండు యాదవ్, ప్రవీణ్, మజర్ బాయ్, రమేష్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, పాఠకులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed