21 ఏళ్లకే అమరత్వం.. చివరి కార్యంలో వేషం మార్చి.. బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించిన యోధురాలు. వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య విప్లవకారిణి ప్రీతిలత వద్దేదార్ అమరత్వ దిన జ్ఞాపకం
Oplus_131072
సెప్టెంబర్ 24 హైదరాబాద్:చావు ఎప్పుడైనా వస్తుంది.. కానీ దానికో అర్థం ఉండాలి.
అది కూడా చైతన్యం కలిగించే అంశం అయి ఉండాలనుకునే వీరులు అతి తక్కువ మంది ఉంటారు. మన భారత స్వతంత్ర సంగ్రామంలో అలాంటి వీరులు ఎందరో నేలకొరిగారు. అతి చిన్న వయస్సులోనే.. తమ యవ్వనాన్ని.. ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం అర్పించి అమరులయ్యారు. మన దేశ చరిత్రలో తమకంటూ ఓ పేజీని రచించుకున్నారు. మన భారత దేశం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవంలో వారి పాత్ర చెప్పలేనిది.. అలాంటి వారిలో ప్రీతిలతా వడ్డేదార్ (Pritilata Waddedar) ఒకరు.
……
ప్రీతిలత వడ్డేదార్ 1911లో మే 5వ తేదీన చిట్టగాంగ్ జిల్లాలో దాల్ ఘాట్ గ్రామంలో జన్మించారు. తల్లి ప్రతిభాదేవి. తండ్రి జగబంధు వద్దేదార్ ఆరుగురు పిల్లల్లో రెండో బిడ్డ ప్రీతి. పేద ఇంట్లో పుట్టినా ఉన్నత చదువుల వల్ల ప్రీతిలతాలో విశాల దృక్పథం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పుస్తకాలు చదివేది.. దానికోసం ఇంట్లో కంటే లైబ్రరీలోనే ఎక్కువగా గడిపేది. నిరంతర అధ్యయనం.. ప్రముఖులతో జరిపే చర్చలతో తన జ్ణానాన్నిపెంచుకుంది. నిజానికి మహిళలకు బయటకు రావడం, చదువుకోవడంపై ఆ టైంలో చాలా ఆంక్షలుండేవి. కానీ ప్రీతిలత తండ్రి ప్రోత్సహంతో ఆ ఆంక్షలను ప్రశ్నించింది.. వివక్షతపై పోరాడింది. పోరాటాల్లో తామేం తక్కువ కాదని నిరూపించింది.
…….
ప్రీతిలతకు ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చినా.. ఉద్యమంవైపే అడుగులు వేసింది. నరనరాల్లో నింపుకున్న దేశభక్తితో దేశ విముక్తి కోసం తాను ఓ సమిధనవ్వడానికి పూనుకుంది. చదుకున్న సమయంలో దీపాలీ సంఘ్ వంటి విప్లవ సంఘంలో చేరి పనిచేసేది. మగవాళ్లతో సమానంగా కర్రసాము నేర్చుకుంది. రోజూ ఎక్సర్సైజ్ చేసేది. ఆ తర్వాత బ్రిటీష్ ఆయుధగారంపై దాడి చేసిన సూర్యసేన్ (Surya Sen) స్థాపించిన ఇండియన్ రెవల్యూషనరీ నేషనలిస్ట్ ఆర్మీలో (Indian revolutionary nationalist) చేరాలనుకుంది.. కానీ మహిళలకు అవకాశం లేదని తెలిసి నిరాశ పడింది. కానీ తర్వాత కాలంలో ప్రీతిలతకు అందులో చేరే అవకాశాన్ని కల్పించారు. దాంతో దేశ బానిస సంకెళ్లను తెంచే అతి పెద్ద బాధ్యతను నెత్తికెత్తుకుంది. తను ఎంచుకున్న మార్గంలో ఎంతోమంది చనిపోయారు.. అయినా సరే ప్రతీలతా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
……
1930లో చిట్టగాంగ్ ఆయుధశాల దాడిలో పాల్గొనడం ద్వారా బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ప్రీతిలత తన అంకితభావాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. వారు ఆయుధాలను కనుగొనలేకపోయినప్పటికీ, వారు కమ్యూనికేషన్ మరియు రైల్వే లైన్లను విజయవంతంగా అంతరాయం కలిగించారు. యూరోపియన్ క్లబ్ పై దాడికి నాయకత్వం వహించిన ప్రీతిలత, సాయుధ బ్రిటిష్ అధికారులు మరియు గార్డులను ఎదుర్కొంది. కాల్పులు జరిగాయి, ఫలితంగా అనేక మంది క్లబ్ సభ్యులు గాయపడ్డారు. విషాదకరంగా, ప్రీతిలతకు బుల్లెట్ తగిలింది. బందీగా మారడానికి బదులుగా, ఆమె పొటాషియం సైనైడ్ తినాలని ఎంచుకుంది. భారతీయ మహిళలు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రపంచానికి చూపించడానికి సేన్ తనకు నాయకత్వం అప్పగించాడని ఆమె డైరీ వెల్లడించింది. ఆమె ధైర్యం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.
……
లీలా నాగ్ మరియు బినా దాస్ వంటి మహిళా స్వాతంత్ర్య సమరయోధులచే ప్రేరణ పొంది, ఆమె విద్యాపరంగా రాణించారు. ఆమె విజయాలు సాధించినప్పటికీ, బ్రిటిష్ అధికారులు ఆమెకు డిగ్రీని నిరాకరించారు. 2012లో, కలకత్తా విశ్వవిద్యాలయం మరణానంతరం ఆమెకు డిగ్రీని ప్రదానం చేసింది, వారి రికార్డులలో ఆమె పేరును ‘వాడ్డర్’ అని సరిచేసింది. ప్రీతిలత వారసత్వం వలసవాదానికి వ్యతిరేకంగా అచంచల ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుంది.
……
1932లో, ఆమె బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని పహర్తాలి యూరోపియన్ క్లబ్‌పై సాహసోపేతమైన దాడికి నాయకత్వం వహించింది. ఈ క్లబ్ బ్రిటిష్ ఆధిపత్యాన్ని సూచిస్తూ ‘కుక్కలు మరియు భారతీయులకు అనుమతి లేదు’ అని రాసి ఉన్న బోర్డును ధైర్యంగా ప్రదర్శించింది. పంజాబీ వ్యక్తిగా వేషం వేసుకున్న ప్రీతిలత మరియు సూర్య సేన్ ‘ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ, చిట్టగాంగ్ బ్రాంచ్’లోని తోటి సభ్యులు క్లబ్‌లోకి చొరబడ్డారు. ఆ దాడిలో తన ఛాతికి బుల్లెట్ గాయమైంది. దారంతా రక్తకారుతున్న మిగతా బృంద సభ్యులకు చెప్పలేదు. వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చింది. తాను ప్రాణాలతో బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని సైనెడ్ తిని ప్రాణాలను వదిలింది. తనకు ఇచ్చిన మిషన్ విజయవంతంగా పూర్తి చేసి.. తాను మాత్రం కుప్పకూలిపోయింది. 1932, సెప్టెంబర్ 23న ప్రతీలత మరణం ఆమె చివరి మజిలీ అయింది.
……
భారత స్వతంత్రం కోసం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ వంటి వారే కాదు.. తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన.. మహిళలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రీతిలతా వడ్డేదార్ ( Pritilata Waddedar) మొదటి వరసలో ఉంటుంది. కేవలం 21 ఏళ్ల వయస్సులోనే తన ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించింది. బతికున్నంత కాలం బ్రిటిష్ వారిపై నిప్పులు కురిపించింది. బ్రిటిష్ అహంకారంపై యుద్ధం చేస్తూనే ఉంది. దానికోసం ఆమె ఎంచుకున్న మార్గం చాలా కఠినమైనది. అయినా సరే ఆ మార్గంలోనే పయనించింది. మాతృభూమి కోసం మగవాళ్లతో సమానంగా వేషాలు మార్చింది..భాష నేర్చుకుంది.. బాంబులు తయారు చేయడం నేర్చుకుంది. తానే ఓ ఆయుధమై కదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మొట్ట మొదటి విప్లవ కారిణి ప్రీతిలత వడ్డేదార్.
ఆమె శరీరంపై దొరికిన ఒక కరపత్రం భారతీయ మహిళలు స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటంలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె కథ ‘ఖేలీన్ హమ్ జీ జాన్ సే’ మరియు ‘చిట్టగాంగ్’ వంటి చిత్రాలలో చిత్రీకరించబడింది.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿