February 22, 2026

స్నేహితుల కొరత.! నేటి కాలంలో స్నేహం బంధాలను దూరం చేసుకుంటున్నారు

0
IMG_20260218_200956

ఫిబ్రవరి 18 హైదరాబాదు: స్నేహితుల కొరత.! ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్నేహితుల కొరత ఏర్పడింది. 1960 ప్రాంతంలో ఒక్కక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990 లలో ఒక్కొక్కరికి 50 మంది స్నేహితులు ఉండేవారు.
2020 నాటికి 10 మంది ఉన్నారు.ఇప్పుడు ఒక్కరు ఉండటం కూడా గగనమే.దేశంలో 12% జనాభాకు స్నేహితులు లేరని ఒక సర్వేలో తేలింది.స్నేహితులతో ముఖాముఖి గడిపే సమయం గతంలో 1 గంట ఉంటే ప్రస్తుతం 35 నిమిషాలకి పడిపోయింది.

మంచి స్నేహితులు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వారు.

స్నేహితులు లేనివారు రోజుకు 20 సిగరెట్లు తాగినంత స్ట్రెస్ అనుభవిస్తారట.

మంచి స్నేహితులు ఉన్నవారిలో blood pressure, గుండె వ్యాధులు తక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి.
స్నేహితులు తోడుగా ఉన్నవారు ఆహ్లాదంగా ఉంటారు, వ్యాయామం, క్రీడలు, ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వారి సాంగత్యంలో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కానీ స్నేహితులు ఊరికినే ఏర్పడరు. స్నేహానికి సమయం పెద్ద investment . కనీస పరిచయం ఏర్పడాలంటే 40 గంటలు కలసి గడపాలి, ఒక మాదిరి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 90 గంటలు, గట్టి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 40 గంటలు కావాలట. మన దగ్గర ఇంత సమయం ఉందా ఇప్పుడు.

ఒకసారి మంచి స్నేహం ఏర్పడ్డాక దానిని నిలుపుకోవాలంటే రోజూ కొంత సమయం కేటాయించాలి.

ఇక మనం పని చేసే ప్రాంతంలో మనం స్నేహం అనుకునేది చాలా వరకు ఉపరితల ముచ్చటే. ఇక ఫేస్ బుక్, వాట్సాప్ స్నేహాలు చొప్పదండూ ముచ్చటే!!
బార్ & రెస్టారెంట్ స్నేహాలు మత్తు ఉన్నంత వరకే

మొత్తం మీద స్నేహానుబంధాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ,
సమయం లేదు మిత్రమా!

అనేదే అతి పెద్ద కారణం!!

సమయాన్ని కేటాయించండి. మంచి స్నేహాలను పెంపొందించుకొండి.

కనీసం ఉన్న స్నేహాలను నిలుపుకొండి!!!
🙏🙏

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed