December 24, 2025

స్కంద పంచమి, కుమార షష్టి, స్కంద షష్ఠి రోజుల్లో ఇలా చేస్తే సంపదలు చేకూరుతాయి

0
IMG-20250701-WA0312

జూలై 1:తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే ! పిల్లలు పుట్టకపోయినా , జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే…. కుమారషష్టి రోజే !శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమారషష్టి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్టి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం. కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కందపంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా , సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే స్కందపంచమి , కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా , రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి , షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed