December 24, 2025

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విదేశీయులు “The God of War” అని సంబోధిస్తారు

0
FB_IMG_1756792817883

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విదేశీయులు “The God of War” అని సంబోధిస్తారు. #చెడుపై మంచి విజయం సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము.

విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో రహస్యం ఏమిటంటే సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము

షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు. #కాలాగ్ని స్వరూపమే ఇది. #కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని. #ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. #ఇదీసంవత్సరాగ్ని రూపం. #ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. #అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి,అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అనిఅర్ధం.

అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయారు

ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. #సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలుఅంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. #వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక.#ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. #మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.#అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. #ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులేదేవసేన. #కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. #వల్లీ దేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.

సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న పేర్లు

షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు – శరములో అవతరించినవాడు
గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి – దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ – తమిళం లో పిలుస్తారు.

ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినేనమః||

ఓం మురుగా

సకల సర్పదోషాలను సంహరించే మహిమాన్విత సర్ప సూక్త పారాయణం #ఈ సర్పసూక్తం అత్యంత విశిష్టమైన విశేషమైనది మహిమాన్వితమైనది #అత్యంత శీఘ్రంగా ఫలితాలను ఇచ్చే గొప్ప సూక్తం #ఈ సూక్తాన్ని ప్రతి నిత్యం పారాయణం చేయడం వలన ఈ సూక్తం చదువుతూ శివుడికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు పరిహారం అవుతాయి #సంతాన దోషాలు అయినా సంతాన అభివృద్ధి లేకపోయినా కుటుంబంలో సఖ్యత లేకపోయినా చికాకులు ఏర్పడుతున్న తరచుగా విష రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్న కాలసర్ప దోషం ఉందని భయం ఉన్నా రాహు కేతు గ్రహాల దశ అంతర్దశ సమయం నడుస్తున్న ఈ సర్ప సూక్తం ని ప్రతిరోజు చదవటం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి #ఇందులో ఎలాంటి సందేహం లేదు #ఈ రోజున ఈ సూక్తాన్ని పారాయణం చేస్తే అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి

సర్ప సూక్తం – సుబ్రహ్మణ్య సూక్తము – ఋగ్వేదము

|| సర్పసూక్తం – సుబ్రహ్మణ్య సూక్తం ||

తైత్తిరీయ సంహితా – ౪.౨.౮

నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ||

ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||

నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||

|| ఇతి సర్ప సూక్తం ||🙏

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed