వరల్డ్ కప్ సాధించిన (2025) భారత మహిళా క్రికెట్ జట్టుకు కి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Oplus_131072
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో విజయం సాధించి, అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు అచంచలమైన ధైర్యం, పట్టుదల, సంకల్పబలం ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వాన్ని, మొత్తం జట్టు చూపిన సమిష్టి కృషి, అత్యుత్తమ ప్రదర్శనను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దాల కల సాకారమైందని, ఈ చారిత్రక విజయానికి దేశమంతా గర్విస్తోందని అన్నారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, పోరాటస్ఫూర్తి దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
🔹 భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భారత జట్టు మరిన్ని విజయాలను సొంతం చేసుకుని, ప్రపంచ క్రీడా రంగంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.