December 24, 2025

రోడ్డు భద్రత ప్రమాణాలు పాటింటం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

0
IMG-20251220-WA1352
 

డిసెంబర్ 20 సూర్యాపేట:

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్ లతో కలిసి రాష్ట్ర రవాణా, బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లు, రవాణా శాఖ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అధికారులతో విడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పోలీస్, రవాణా, రెవిన్యూ, ఆర్ & బి, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయం చేసుకుంటూ జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని అలాగే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 26% మరణాలు, 9% ప్రమాదాలను తగ్గించడం జరిగిందని వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఇట్టి సమస్యను పరిష్కరించే దిశగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వకూడదని అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థులకు, యువకులు తెలియజేసేలా పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ బస్సులు,లారీలు రోడ్డుపై ఆపకుండా ప్రక్కన ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ,పోలీస్,రెవెన్యూ, ఆర్ అండ్ బి, హెల్త్,ఇండస్ట్రియల్, పంచాయతీరాజ్ ఇంజనీర్, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ లాంటి శాఖలు తమ కార్యచరణ ప్రణాళికను వచ్చే సోమవారం నాటికి అందించాలని ఆదేశించారు.మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలలో, రెసిడెన్షియల్ స్కూల్స్లలో వ్యాచరచన పోటీలు,రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని అలాగే పిల్లలకు రోడ్లు ఏ విధంగా దాటాలో అవగాహన కల్పించాలని ఆర్టీసీ బస్టాండ్లలో వారంకు ఒక కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత పై ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కల్పించాలని బైకు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, షీట్ బెల్ట్ ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, అలాగే కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని,వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వటం జరుగుతుందని తర్వాత ఎవరైనా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే వారి వాహనాలను కలెక్టరేట్లోకి అనుమతించేది లేదని హెచ్చరించారు.

మండల స్థాయి లో తహసీల్దార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాదాలపై కమిటీ ఏర్పాటు చేసి బ్లాక్ స్పాట్స్ గుర్తించి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.బ్లాక్ స్పాట్ ల దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారుల నుండి అనుసంధానం అయ్యే మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు,సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ అలాగే రవాణా శాఖ అధికారులు లారీ డ్రైవర్లతో, స్కూల్ బస్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించి వాహనాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చూడాలని అలాగే ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

డ్రైవర్లకు హెల్త్ క్యాంపు లు నిర్వహించి టి బి లాంటి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తోపాటు మందులు ఇవ్వాలని అన్నారు.

మున్సిపాలిటీలో స్కూల్ జోన్ లాంటి ప్రాంతాలలో ఆటోలు,రిక్షాలు, క్యాబ్ డ్రైవర్లకు నేమ్మిదిగా వెళ్లేలా మున్సిపల్ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సాండ్ టాక్సీ, మైనింగ్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రేడియం స్టికర్ అతికించాలని, పరిశ్రమలకు చెందిన వాహనాల డ్రైవర్లకు సరిపడే నిద్ర ఉండేలా డ్యూటీ లు ఇచ్చేవిధంగా యాజమాన్యం తో మాట్లాడితో చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకి గురైన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు 1.50 లక్షల రూపాయలు వారం రోజుల్లో సంబంధిత హాస్పిటల్ కు అందజేస్తుంది కాబట్టి రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు వెంటనే చికిత్స చేయాలని హాస్పిటల్ యాజమాన్యులను కోరారు.

రాత్రి పూట పశువులు, కుక్కలు రోడ్లపై సంచరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు తగ్గిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

జాతీయ రహదారులపై ఏమైనా ప్రమాదాలు జరిగితే వారికి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కు తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

  చిన్న చిన్న భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రాణాలను కాపాడినవారిమి అవుతామని ఇట్టి విషయాన్ని అధికారులు  సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ఎస్పీ కే నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, పశుసంవర్ధన అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జిఎం సీతారాం,వెల్ఫేర్ అధికారులు శంకర్ నరసింహారావు వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈవో అశోక్ తదితరులు హాజరైనారు.


జారీ చేసిన వారు, జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed