రెక్కీ నిర్వహించిన రోహింగాలపై చర్యలు తీసుకోవాలని మీర్ పేట్ సీఐ కి ఫిర్యాదు చేసిన శ్రీరాములు అందెల
జూలై 4:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు ఇటీవల బాలాపూర్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల స్థావరాలను గుర్తించి సాక్షాదారాలతో ప్రభుత్వ అధికారులకు మరియు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేశారు. కాగా పలు సోషల్ మీడియా మాధ్యమాలలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై వరుసగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కొందరు రోహింగ్యాలు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించగా శ్రీరాములు గారి ఇంట్లోని వర్కర్ ప్రశ్నించడానికి వెళ్ళగా వెంటనే ఆ యొక్క యువకుడు తన వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఈలోపు రెక్కీ నిర్వహిస్తున్న మరికొంత మంది రోహింగ్యాలను బిజెపి నేతలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వదిలి వెళ్ళిన వాహనంలో పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్స్, రాడ్స్ కనిపించగా మీర్పేట్ సీఐ గారికి ఫిర్యాదు కోసమై రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి గారితో కలిసి శ్రీరాములు గారు సీఐ గారికి ఫిర్యాదును అందించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ రోహింగ్యాలపై తన పోరాటం ఆగదని నియోజకవర్గ హిందువులంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బడంగ్ పెట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, హిందూ సంఘాలు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.