రుద్రాయిగూడెం గ్రామంలో భగవంత్ రావు అంతిమ యాత్ర లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
జులై 3:డిండి మండలం రుద్రాయిగూడెం గ్రామానికి చెందిన దొంతినేని భగవంత్ రావు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం రుద్రాయిగూడెం గ్రామంలో భగవంత్ రావు మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. భగవంత్ రావు గ్రామ ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు.భగవంత్ రావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంత్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట PACS ఛైర్మన్లు మాధవరం శ్రీనివాస్ రావు, పల్లా ప్రవీణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు,TVN రెడ్డి, వెల్లుగురి వల్లపు రెడ్డి, మాజీ ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు,చింతపల్లి సుభాష్, రేటినేని ముత్యపు రావు, మాధవరం జనార్దన్ రావు, ఉప్పుగంటి ప్రశాంత్ రావు,గొడుగు వెంకటయ్య,బొడ్డుపల్లి కృష్ణ,ఎర్ర యాదగిరి,నాగవరం వెంకటేశ్వర్ రావు, తండు వెంకటయ్య, పాత్లవత్ దశ్రు నాయక్,నాగవరం రాజ్, తండు చంద్రయ్య, శ్రీనివాస్ చారి,గుర్రం సురేష్,చరణ్,తదితరులు ఉన్నారు.