రావిరాల ఎల్లమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్న భక్తులు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్న భక్తులు
అక్టోబర్ 26 రావిరాల మహేశ్వరo: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మండలం రావిరాల గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వరద నీరు రోడ్డు మధ్యలో నిలిచి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. రావిరాల గ్రామం నుండి ఎల్లమ్మ దేవాలయానికి మార్గం మధ్యలో నీరు నిలిచిపోయి వాహనాలు వెళ్లడానికి మరియు కాలినాడకన వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గమనించి రోడ్డు మార్గం సరి చేయవలసిందిగా కోరుతున్నారు భక్తులు, ఎల్లమ్మ దేవాలయం అంటే భక్తులకు ఎంతగానో నమ్మకము. ప్రతి మంగళవారము దేవాలయానికి వేళల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయని తెలిపారు భక్తులు. స్థానిక అధికారులు దేవాలయ వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే భక్తుల సంతోషంగా ఎల్లమ్మ దేవాలయం దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని అంటున్నారు దర్శనానికి వచ్చిన భక్తులు. ఎల్లమ్మ తల్లి దేవాలయం దర్శించుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు ప్రతి మంగళవారం రోజు.