మహేశ్వరం గట్టుపల్లిలో రేవ్ పార్టీ దుమారం:కేసీఆర్ రిసార్టుపై పోలీసుల దాడి – 75 మంది అదుపులోకి
అక్టోబర్ 15 మహేశ్వరం:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలోని కేసీఆర్ రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ రాక్ స్టార్ హైబ్రిడ్ కాటన్ సీడ్స్ ప్రమోషనల్ ఈవెంట్ పేరుతో ఈ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం — రాక్ స్టార్ సీడ్స్ నిర్వాహకులు ముత్తన్న సైదా రెడ్డి,స్టేజ్ ఈవెంట్ ఆర్గనైజర్ కుందరపు గురు సందేశం,వేద అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సీడ్స్ ప్రతినిధి తిరుమల్ రెడ్డి కలిసి ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.ఇందులో 11 మంది మహిళలు, 30 మంది పురుషులు పాల్గొన్నారు.సమాచారం అందుకున్న వెంటనే మహేశ్వరం పోలీసులు దాడి చేసి,మొత్తం 20 మంది మహిళలు,55 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలను తుక్కుగూడ ప్రజ్వల సఖీ సెంటర్‌కు తరలించారు.దాడిలో పోలీసులు రూ.50,000 నగదు, రూ.5,46,090, రూ.89,570 నగదు, 8 బ్లాక్ డాగ్, 8 బడ్వైజర్ మద్యం బాటిళ్లు, 14 కార్లు, 55 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఆపరేషన్‌లో ఎస్సైలు ప్రసాద్, ధనుంజయ్,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.హైబ్రిడ్ సీడ్స్ ఈవెంట్ పేరుతో జరిగినా,అది మద్యం,డ్యాన్స్ కార్యక్రమాలతో చట్టవిరుద్ధ రేవ్ పార్టీగా మారిందని పోలీసులు పేర్కొన్నారు.రిసార్ట్ యజమాని సహా మొత్తం 55 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.