మనిషి మనిషిలా మనుషుల మధ్యలో బతకడం నేర్చుకోవాలి. ఆలోచనలు లేని బతుకులు కష్టాల పాలు అవుతున్నాం జీవితాలు.! (మసున లక్ష్మణ్ కుమార్ రచయిత)
జులై 27 హైదరాబాద్: మనిషి తాను బతుకుతున్నాను అనుకుంటున్నాడు కానీ తన బతుకుతాను ఎలా బతుకుతున్నాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది. కొంతమంది వెళుతూ వెళుతూ స్మోకింగ్ చేసుకుంటూ వెళ్తారు అది వెనుక నుంచి వచ్చే జనాలు ఎంతమంది పిలుచుతున్నారు రోగాల బారిన పడతారు అని ఆలోచన లేదు, మద్యం తాగి రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తెల్లారి కనీసం ఆలోచన లేకుండా తన జీవితం తానే గడుపుతుంటారు కొంతమంది. ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఏది తోస్తే చేయడం తర్వాత బాధపడడం కొంతమంది లో కనిపిస్తుంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలామంది ప్రాణాలు విడిచి పెడుతున్నారు. మన ఆలోచన మన స్థితికి కారణమవుతుంది అని చాలామంది భావించారు. నిత్యం చాలామంది ఇంటి నుంచి వెళ్లేటప్పుడు చెత్తని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు ఇది ఆలోచన లేని పని. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని స్థితిలో ఉన్న మానవుడు, బ్రతికి బాధ్యత భవిష్యత్తు ఆలోచన చేసుకోవాలి. తాను చేసే పని తనకు నచ్చితే చాలు అనుకునే కొంతమంది, నలుగురికి నచ్చేలా చేయాలని ఇంకొంతమంది సరైన ఆలోచనతో ముందడుగు వేయాలి.