February 22, 2026

బీ.టీ. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

0
IMG-20250630-WA2594

జూన్ 30: జుక్కల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపనలు చేయడం జరిగింది. వీటి అంచనా విలువ సుమారు 6 కోట్ల 82 లక్షల రూపాయలు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత పరిపాలకుల నిర్లక్ష్యంతో కనీసం గ్రామాలలో రోడ్లు వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు గ్రామాలలో పర్యటించినప్పుడే.. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ముందుగా రోడ్లు వేయించాలని ధృడంగా నిశ్చయించుకున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని,వారి సహకారంతో జుక్కల్ నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో సీ.సీ రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు మొత్తం 33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత పాలకులు చేయలేని అసాధ్యమైన పనులు కూడా చేపడుతున్నామని అన్నారు. అసమర్థ నాయకుల వల్ల ఆగిపోయిన లెండి,నత్తనడకన సాగుతున్న నాగమడుగు ప్రాజెక్టుల పనులు నేడు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ఇక ముందు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్నాలకు క్వింటాలుకు 500 బోనస్ ఇచ్చి అన్నదాతకు అండగా నిలిచాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed