బహిరంగ సభ ను విజయవంతం చేయండి: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్
మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 2 ఖమ్మం: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాపురం నందు సురేష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆవశ్యకతను మారుమూల గ్రామాల్లోకి చేరవేయడమే లక్ష్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ల పై బి ఆర్ ఎస్ చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సెంటిమెంట్ తో మరోమారు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు.దేశంలో ఎక్కడ లేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మరియు అభివృధి పనులు పరుగులు పెడుతూ అమలు అవుతున్నాయని 4 వ తేదీన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నామని దాన్లో భాగంగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ లో పర్యటించనున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఖమ్మం ఎం పి రామసహాయం రఘురాం రెడ్డి మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ల ఆధ్వార్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు సభకు హాజరై విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఒక ప్రకటన లో తెలిపారు.