ఫ్యూచర్ సిటీ ఫలాలు యువతకు అందాలి: రాహుల్ గాంధీఢిల్లీలో అగ్రనేతతో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల నేతలుస్థానిక ఎన్నికల్లో హస్తందే హవా అని చెప్పిన KLR
డిసెంబర్ 14 మహేశ్వరం: సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులే భారీ విజయం సాధిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు, తెలంగాణ సమగ్రాభివృద్ధిని యువనేత దృష్టికి లక్ష్మారెడ్డి తీసుకెళ్లారు.
భారత్ ఫ్యూచర్ సిటీతో అంతర్జాతీయ పెట్టుబడులు తెలంగాణకు విస్తృతంగా రానున్నాయని శ్రీ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు కిచ్చెన్న. గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సుధీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి మరియు పార్టీ పటిష్టంగా మారుతుందని KLR చెప్పారు. అందుకు నిదర్శనమే సర్పంచ్ ఎన్నికల్లో సింహభాగం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని అన్నారు.
ఫ్యూచర్ సిటీ- గ్లోబల్ సమ్మిట్ ఫలాలు… యువత, నిరుద్యోగులకు అందేలా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీ రాహుల్ గాంధీ గారు సూచించినట్లు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ గారి భేటీలో KLR తోపాటు మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏపీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, జిల్లా అధ్యక్షులు ఓబేదుల్లా కోత్వాల్ ఇతర నేతలు పాల్గొన్నారు.