ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలపై 72 గంటల కాలేజీల బంద్ ని విజయవంతం చేయండి – పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు
జూన్ 30:తెలంగాణ రాష్ట్ర కమిటీ పిడిఎస్ యు( ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) పిలుపులోపు భాగంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలకై 72 గంటల ఇంజనీరింగ్ ,డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బంద్ ను విజయవంతం చేయాలని స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్ , పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జులై 2,3,4 తేదీలలో జరగబోయే 72 గంటల కాలేజీల బంద్ నువ్వు విజయవంతం చేయాలని పేర్కొనడం జరిగింది. 2024- 25 సంవత్సరానికి రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న అరకోరా నిధులు కేటాయించడం తప్ప వాటిని విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఇవ్వడంలో విఫలమైందని తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్లు రాక విద్యార్థులు స్వయంగా చెల్లించే స్తోమత లేక, తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని అనేకమంది పేద విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంకులు సంపాదించి సర్టిఫికెట్లు తమ దగ్గర లేకపోవడంతో ఉన్నత విద్యలకు దూరమవుతున్నారని తెలియజేయడం జరిగింది. ఫైనల్ ఇయర్ పాస్ అయి ఉన్నత విద్య చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేటు యజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక పేద ,బడుగు ,బలహీన వర్గాల విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు. అదేవిదంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ప్రభుత్వ కుట్రను వ్యతిరేకించాలని విద్యార్థులందరూ ఈ జూలై 2,3,4 తేదీలలో జరిగే 72 గంటల కాలేజీల బంద్ లో పాల్గొని విజయవంతం చేయవలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.