December 24, 2025

ప్రపంచవ్యాప్తంగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

0
IMG-20250907-WA0304

సెప్టెంబర్ 7 హైదరాబాద్:

  • ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో సుమారు 85% మంది ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుండగా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనమివ్వనుంది. చంద్రుడు మొత్తం 82 నిమిషాల పాటు భూమి నీడలో ఉండనుంది. చంద్రగ్రహణం నేడు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగుతుంది.

ఈ గ్రహణం శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలలో సంభవిస్తున్నందున పండితులు భక్తులను జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాలు మూసివేయబడ్డాయి.

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం: మధ్యాహ్నం 1 గంటకు ఆలయ మూసివేత, సోమవారం ఉదయం 5 గంటలకు శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 9:30 నుండి దర్శనానికి అనుమతి.

వేములవాడ రాజన్న ఆలయం: ఉదయం 11:25 గంటలకు మూసివేత, సోమవారం ఉదయం 3:45 వరకు ద్వారబంధనం, అనంతరం ఉదయం 4 గంటలకు పూజలు పూర్తయ్యాక దర్శనం.

కాళేశ్వర శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం: మధ్యాహ్నం 12 గంటలకు మూసివేత, రేపు ఉదయం 7:30 శుద్ధి అనంతరం దర్శనం.

భద్రకాళి ఆలయం (వరంగల్): మధ్యాహ్నం 1 గంటకు మూసివేత, రేపు ఉదయం 6 గంటలకు శుద్ధి పూర్తయ్యాక ఉదయం 7 గంటల నుండి దర్శనం.

గ్రహణం కారణంగా రెండు రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను నిలిపివేసినట్లు ఆలయాధికారులు ప్రకటించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed