ప్రణయ మిత్ర క్లినిక్ వైద్య బృందానికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మల రెడ్డి
జూలై 1:మన ఊరి న్యూస్ ప్రతినిధి జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా బోడుప్పల్ హెచ్. బి. కాలనీ లో ఉన్న ప్రణయ మిత్ర క్లినిక్ వైద్య బృందానికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన *తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మల రెడ్డి. సందర్భంగా నిర్మల రెడ్డి మాట్లాడుతు. ప్రతి మనిషికి జన్మనిచ్చేది దేవుడు.మరణంతో పోరాడుతున్న మనిషిని కూడా, బ్రతికించి పునర్జన్మ నిచ్చేవాడు వైద్యుడు మాత్రమే అని అన్నారు. వైద్యం అంటే కేవలం ఒక వృతి గా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తి, ఎలాంటి అపద సమయం లో అయిన కానీ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టీ ప్రజా శ్రేయస్సు కొరకు కృషి చేసింది కేవలం ఒక డాక్టర్ మాత్రమే. అందుకే మనం డాక్టర్ నీ వైద్యో నారాయణ హరి అని అంటాము..అనంతరం క్లినిక్ లో రోగులకు *నిర్మల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్* ద్వారా పేషంట్స్ కి బ్రెడ్స్ , బిస్కెట్స్ పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ హేమ శ్రీనివాస్ ని మరియు హాస్పిటల్ నర్సులను నిర్మల రెడ్డి మరియు వారి స్టాఫ్ నీ ఘనంగా దూసేల్వ తో సత్కరించారు. కార్యక్రమంలో శివ కుమార్,షాలిని, శిల్ప, సోనీ, వాణి స్వప్న, శైలజ, పద్మ, తదితరులు పాల్గొన్నారు. చింతల నిర్మల రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్