ప్రజాపాలనలో పేదలందరికీ ఇండ్లు:KLRఆడపడుచులందరికీ చీరెలు అందిస్తాంలబ్దిదారులతో కలిసి కిచ్చెన్న గృహప్రవేశం
మహేశ్వరం నవంబర్ 22: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
మహేశ్వరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ… గృహప్రవేశం చేసిన ఆడపడుచులకు త్వరలోనే ప్రభుత్వం తరపున చీరెలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ కు వెళ్లేందుకు జనం ఇష్టపడలేదన్నారు. అందుకే సొంత ఊర్లోనే ఉండేలా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి లబ్ధిదారులకు ఆసరాగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలుస్తుందని లక్ష్మారెడ్డి తెలిపారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని కిచ్చెన్నగారు గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు సహా స్థానికులు పాల్గొన్నారు.