పేదల పాలిట సంజీవని – సీఎం రిలీఫ్ ఫండ్ తో ఉపశమనం
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:మహేశ్వరం నియోజకవర్గంలోని డబ్లుగూడ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా దయాకర్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అల్వాల బాల్రాజ్‌కు చెక్కు అందజేశారు.పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో నాటి వైఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ, చికిత్స ఖర్చులను రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అత్యవసర చికిత్సలు పొందుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆరోగ్య సమస్యల కారణంగా అనేక కుటుంబాలు ఆస్తులు, బంగారం అమ్ముకోవడం,తనఖా పెట్టడం వంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో,ప్రభుత్వ సహాయ నిధి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తమకు సాంత్వన లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ,ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన కిచ్చెన్నకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డబ్లుగూడ గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా దయాకర్,మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల యాదయ్య,మహిళా అధ్యక్షురాలు కందుల సమత ప్రకాష్,ఐ ఎన్ టి యు సి కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ,ఇంద్రమ్మ కమ్మటి అధ్యక్షులు బొర్రా జనార్ధన్,గ్రామ సెక్రటరీ పుష్పలత,సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్,గ్రామ పెద్దలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.