December 24, 2025

పూజించే విధానాన్ని ఉపచారం అంటారు. #ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలని పంచోపచారాలు అంటారు

0
FB_IMG_1756355597090

కుబేరుడి మరియు లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంటె సకలసంపదలను పొందవచ్చు

పూజించే విధానాన్ని ఉపచారం అంటారు. #ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలని పంచోపచారాలు అంటారు. #అంటే ఐదు విధానాల ద్వారా దేవతానుగ్రహం పొందటం అన్నమాట

1. దేవుడి పటాలకి పసుపు, కుంకుమ, చందనం వంటివి పెట్టడం

2. దేవుడి పేరు చెప్పి, పూవులతో అర్చన చేయడం

3. ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాణి, అగరత్తులు వెలిగించడం

4. నేతితో దీపం వెలిగించి…దీపారాధన చేయడం

5. నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించడం.

ఈ ఐదింటిలో ఏదైనా ఒకటి నైనా రోజూ పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. #రోజూ పంచోపచారాల్లో ఏదైనా ఒక్కదాన్నైనా పాటిస్తే.. దేవతానుగ్రహాన్ని పొందవచ్చు. #ఇంకా ధనప్రాప్తి కోసం.. ఇంట్లోని కామాక్షి దీపంలో వజ్రపు రాయిని పొదిగిస్తే, లక్ష్మీ కటాక్షం పొందవచ్చు.

కుబేరుడి అనుగ్రహం పొందాలంటే

ధనాధిపతి కుబేరుని అనుగ్రహం పొందాలంటే..? ఇంట్లో మీకు నచ్చిన ఊరగాయలను తయారుచేసి పెట్టుకోండి.. అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇదేంటి? నిజమా? అని అడుగుతున్నారు కదూ.. నిజమే. #మీ ఇంట ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయలతో పాటు మీకు నచ్చిన ఊరగాయలను తయారు చేసి పెట్టుకోండి.

అంతేగాకుండా వాటిని శుభ్రంగా ఉపయోగించడం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. #వాటిని చెడిపోనివ్వకూడదు. స్నానం చేయకుండా వాటిని తాకకూడదు. #ఇంకా నెలసరి సమయంలో మహిళలు వాటిని తాకకపోవడం మంచిదని వారు చెప్తున్నారు. అప్పుడే ఊరగాయ ఉన్నచోట కుబేరుడు నివాసం ఉంటాడని పండితులు సూచిస్తున్నారు.

ఇంకా ఇంట్లో అనేక రకాల ఊరగాయలను ఉంచితే లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది.

కుబేరుడు ఊరగాయ ప్రియుడు. అందుచేతనే ఇంట్లో ఊరగాయ ఉండటం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చును. #ఇంకా ఇంటికొచ్చే సుమంగళీ మహిళలకు నీరు ఇవ్వాలి. ఆపై పసుపు, కుంకుమలు ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపం, దారిద్ర్యం తీరిపోయి.. ధనాభివృద్ధి చేకూరుతుంది. #అలాగే అమావాస్య రోజున ఇంటి ముందు రంగవల్లికలు, ముగ్గులు ఉండకూడదు. తలంటుస్నానం చేయకూడదు. #ఆ రోజున పితృదేవతలను పూజిస్తే.. సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

అలాగే మహాలక్ష్మీ దేవి సంపదకు అధిపతి. కుబేరుడు సంపదను సంరక్షిస్తాడు. #అందుకే కుబేరుని పటంతో కూడిన లక్ష్మీ పటాన్ని ఇంట్లో ఉంచి పూజించాలి. #వ్యాపారంలో లాభం పెరగాలంటే.. కుబేరునికి పాలాభిషేకం చేయించి… ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించాలి. #తమిళనాడులోని తిరువణ్ణామలై ఆలయ గిరి ప్రదక్షణ సమయంలో కుబేర లింగాన్ని తప్పకుండా దర్శించుకుంటే ధనానికి లోటుండదు. ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. #అలాగే గురువారం రోజున కుబేరుడిని పూజిస్తే సకలసంపదలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.

సర్వోజనా సుఖినోభావంత్

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed