December 24, 2025

నూతనంగా ఎన్నికైన కందుకూరు మరియు మహేశ్వరం మండలాల సర్పంచ్ లను ఘనంగా సత్కరించిన రాష్ట్ర బిజెపి అధినాయకత్వం.రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారుతెలంగాణలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే – బిజెపి చీఫ్ ఎన్. రామచందర్ రావు

0
IMG-20251220-WA1217

డిసెంబర్ 20 మహేశ్వరం:

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మరియు మహేశ్వరం మండలాలలో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లను మరియు వారి యొక్క పాలకవర్గాన్ని ఈరోజు రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ గారు, మరియు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ లక్ష్యంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతున్నారని దానికి నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లలో భారతీయ జనతా పార్టీకి విశేష ఆదరణ లభించిందని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించాలని…నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్న కందుకూరు మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని తెలంగాణ రాష్ట్రంలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, మండల అధ్యక్షులు అంజి రెడ్డి, యాదిష్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed