నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్
ఆగస్టు 28:నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్, వీరిని ప్రాజెక్టు ప్రసాద్ గా ప్రజలు పిలుసుకుంటారు. నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సొంత డబ్బును ఖర్చు చేసి ఎంతోమంది ఇంజనీర్ల చేత నమూనాలు ఎస్టిమేట్ చేయించి ఢిల్లీ పెద్దల ప్రభుత్వాన్ని ఒప్పించి కోస్ల కమిటీని రప్పించి ఇది సరైన స్థలంగా నిర్ణయించడంలో ప్రసాదు గారి పాత్ర కీలకమైనది. కమిటీ నిర్ణయించిన తర్వాత తన కలపలిచిందని సంతోషపడిన వాడు మహేశ్వర ప్రసాద్ .
ఇంతా చేసిన ఆ నాడు 1955 ఆగస్టు 10 శంకుస్థాపన కార్యక్రమానికి మహేశ్వర ప్రసాద్ గారికి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆహ్వానం లేదు. అయినా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతో ధనాన్ని దానంగా ఇచ్చాడు. 1967 లో ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసిన సందర్భంలో కూడా ఆయనకు ఎటువంటి పిలుపు లేదు. ఎంతో వ్యాకులత చెందిన మహేష్ వరప్రసాద్ ఆనాటి ప్రముఖ సంపాదకులు పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరావు గారి దగ్గరికి వెళ్లి తమ మనోవేదన వెళ్ల బో స్తాడు. ప్రసాదు నిన్ను ఆహ్వానించకపోయినా నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ప్రాజెక్టు ఉన్నంతకాలం అని ఓదారుస్తాడు. ఇది చరిత్రలో జరిగిన సత్యం.
వెనుక కారణం రాజకీయంగా ఆనాడు జమీందారులంతా జస్టిస్ పార్టీలో ఉండేవారు అందుకే ఆహ్వానం అందలేదని ప్రజలు చెప్పుకుంటారు.