ధర్మ రక్షణ సభను విజయవంతం చేసిన నా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – శ్రీరాములు అందెల
జనవరి 24 మహేశ్వరం: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్ లో నిర్వహించినటువంటి ధర్మ రక్షణ సభను విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులందరికీ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలు మరియు బంగ్లాదేశీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ యొక్క ధర్మరక్షణ సభకు శ్రీకారం చుట్టిన భాగ్యనగర్ గణేశ సమితి వారికి, గణేష్ సేన వారికి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారికి, వివిధ క్షేత్రాల నాయకులకు మరి ముఖ్యంగా సభకు సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పోలీసు శాఖ వారికి, ప్రభుత్వ అధికారులకు మరియు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.