December 24, 2025

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు గిరిల్లాదల నాయకురాలు ఆరుట్ల కమలాదేవి

0
Oplus_131072

Oplus_131072

తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా ఆలేరు కేంద్రముగా పోరాటం చేసిన యోధురాలు.నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనీ, తన భర్త -పోరాట యోధుడు రామచంద్ర రెడ్డి తో కలసి రజాకార్లు -ఫ్యూడల్ దొరలు కు వ్యతేరేక ఉద్యమములో ప్రముఖ పాత్ర వహించిన ఉద్యమ కారిణి, మాజీ ఎమ్మెల్యే ఆరుట్ల కమలాదేవి గారి
జ్ఞాపకం !

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఆమె అసలుపేరు రుక్మిణి. 1920లో పూర్వపు నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది.
11 సంవత్సరాల వయస్సులో తన మేనమామ రామచంద్రా రెడ్డి ని వివాహమాడి, అయన సహకారం తో హైస్కూలు విద్యనభ్యసించి, తన భర్తకు ప్రేరణ అయిన బెంగాల్ కమ్యూనిస్ట్ ఉద్యమకారిణి కమల దేవి చోటోపాధ్యాయ పేరును (తన తల్లి తండ్రులు పెట్టిన పేరు రుక్మిణి ) తన నామధేయముగా స్వీకరించింది. ఆమె భర్త గాంధేయవాది. వరకట్నం తీసుకోలేదు కానీ, పెళ్ళి సమయంలో వధూవరులకు ఖద్దరు వస్త్రాలే ఇవ్వాలనీ, వివాహం తరువాత అమ్మాయిని హైదరాబాద్‌ పంపించి చదివించాలనీ మామగారికి స్పష్టం చేశారు. తన భార్య విద్యావంతురాలై దేశ సేవ చేయాలనేది ఆయన వాంఛ. అందుకే కమలాదేవి అని నామకరణం చేశారు.

1932లో చదువుకోసం కమలాదేవి హైదరాబాద్‌ వచ్చారు. ఆంధ్రోద్యమ పితామహుడు మాడపాటి హనుమంతరావు కృషి వల్ల… తెలుగు అమ్మాయిల కోసం హైదరాబాద్‌లో ఒక పాఠశాల ఏర్పాటయింది. కానీ వసతి లేదు. అక్కడ రెడ్డి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఆమె భర్త రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, మరికొందరు మిత్రులు… బాలికల హాస్టల్‌ ఆవశ్యకతను రాజాబహదూర్‌ వెంకటరామారెడ్డికి వివరించారు. ఆయన చలవతో బాలికలకు హాస్టల్‌ ఏర్పాటయింది. పన్నెండేళ్ళ కమలాదేవి మూడో తరగతిలో చేరి, ఆ హాస్టల్‌కు ప్రారంభోత్సవం చేశారు. మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. చదువుకొనే సమయంలోనే ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాలంటీర్‌ దళాలకు నాయకత్వం వహించారు

అనంతరం అత్తవారి గ్రామమైన కొలను పాకకు చేరుకుని.. ఆడపిల్లల కోసం పాఠశాలను, గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో రాజకీయాలనూ, నిజాం పాలన దౌర్జన్యాలనూ చర్చించుకోవటంతో ప్రభుత్వం, జాగీర్దారులూ… బడినీ, గ్రంథాలయాన్నీ స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల అండతో వాటిని కాపాడింది కమలాదేవి.

HSC విద్య పూర్తి చేసి కొలను పాక తాము ప్రారంభించిన రహస్య విద్యా కేంద్రములో టీచర్ గా చేరి, అక్కడి భూస్వామిక వ్యవస్త దొర ఆగ్రహం వలన నిరంతర నిఘ తో మూసివేతకు పిలుపు నివ్వగా , జైన్ సంఘం వారు భూమినిచ్చి స్కూలు కొనసాగింపుకు సహాయపడ్డారు

తదుపరి కమలా దేవి కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యం లో సాగుతున్న ఆంధ్ర మహాసభ సభ్యురాలు గా చేరి సాయుధ పోరాట పద్దతులను విజయవాడ లో శిక్షణ పొందినది.
……
నిజాం విధించిన సైనిక పాలన వలన సాయుధ పోరాట వాదులు రహస్య స్థావరాలకు వెళ్లిన సమయమున కమలాదేవి చల్లూర్ అడవి లో సాయుధ పోరాట నాయకురాలిగా ఉద్యమాన్ని నడిపింది.
……
1944లో విధించిన మార్షల్ చట్టం వల్ల తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఉద్యమకారులు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె రహస్య జీవితం లో ఉన్న కాలంలో, ఆమె చల్లూరు భూములలో చురుకైన పోరాట నాయకురాలు. సాధారణంగా, ఆమె అనారోగ్యం పాలైంది మరియు తన తల్లి నివాసానికి వెళ్లవలసి వచ్చింది.
…..
తిరుగుబాటుదారుల కోసం వెతుకుతున్న నిజాం కోసం పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని గుర్తించి అరెస్టు చేశారు. రామచంద్రారెడ్డిని ఖమ్మం జైలుకు, ఆరుట్ల కమలాదేవిని వరంగల్‌కు, ఆ తర్వాత ఔరంగాబాద్‌ జైలుకు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ జైలుకు. ఆమె 1948లో జైలు పాలైంది, హైదరాబాద్ సంస్థ భారత యూనియన్‌లో విలీనం కావడానికి కొన్ని నెలల ముందు, 1951 తర్వాత విడుదలైంది.
….
1948లో… స్వతంత్ర భారతంలో నైజాం రాష్ట్రం విలీనం అయిన తరువాత… అప్పటి వరకూ అడవిలో ఉంటూ ప్రాణాలకు తెగించి ముష్కరులతో పోరాడిన వారందరూ ఆయుధాలు విసర్జించి, నగర ప్రవేశం చేయాలని భారత ప్రభుత్వం కోరింది. అయితే తమ ఉద్యమాన్ని మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుందనే భావనతో కొందరు ఉద్యమకారులు వెనక్కి రాలేదు. వారిలో కమలాదేవి ఒకరు. ఆమె 1949 జనవరిలో… బహదూర్‌ పేట శివార్లలో అరెస్టయ్యారు. వివిధ కారాగారాల్లో రెండున్నర ఏళ్ళు జైలు శిక్షను అనుభవించిన ఆమె అక్కడి మహిళ దుస్థితిపై నిరసన దీక్ష చేపట్టారు. దాంతో ఆమెను ఔరంగాబాద్‌ జైలుకు పంపించారు. ఆమెపై మోపిన ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో… కేసులన్నీ కొట్టేశారు. కానీ విడుదల చేయలేదు. చివరకు హైదరాబాద్‌ కోర్టులో కమలాదేవి పిటిషన్‌ దాఖలు చేయడంతో, 1951లో విడుదల చేశారు. అనంతరం 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. పదిహేనేళ్ళపాటు అదే స్థానం నుంచి కమ్యూనిస్ట్‌ పార్టీ తరఫున శాసనసభ్యురాలుగా ఉన్నారు. 1963-64 మధ్య ప్రతిపక్ష కమ్యూనిస్ట్‌ నాయకురాలుగా పని చేశారు. ఈ విధంగా ఆంధ్ర శాససభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా నిలిచారు.
…..
విరోచిత తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని తెరచింది. ఈ పోరాటానికి నాయకత్వ పాత్ర వహించింది కమ్యూనిస్టుపార్టీ. అందులో మహిళల పాత్ర అపూర్వం, అనిర్వచనీయం. దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరవనిత ఆరుట్ల కమలాదేవి. తన తరం మహిళలు గృహిణులుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో పెళ్ళికి ముందు “రుక్మిణి”గా వుండి ఆ తరువాత కమలాదేవిగా మారి కమ్యూనిస్టు ఉద్యమ వీరనారీమణులలో ఒకరిగా 2001 జనవరి 1 న కన్నుమూశారు. ఎ.ఆర్ గా అంతా పిలుచుకునే సాయుధపోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్యగా, రాజకీయరంగంలో కూడా భర్తతోపాటు కొంగుబిగించి తుపాకీ చేబూని గొరిల్లాపోరాటం సాగించిన పోరాట వీరగాథలు నేటికీ యువతరానికి ఒక ఉత్తేజం.

  • పోరాట జీవితం…

చలూరు గ్రామం గొరిల్లా దళాలకు ఆనాడు ఒక ముఖ్యకేంద్రం. చల్లూరు-వెంకటాపురం గుట్టలను చుట్టుముట్టి రిజర్వు పోలీసులు సాగించిన తుపాకీగుళ్ళ దెబ్బలకు ఎదురుకాల్పులు జరుపుతూ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన విప్లవ దంపతులు ఆరుట్ల కమలాదేవి,ఎ.ఆర్ .శత్రు మూకలను అమెరికన్ రైఫిల్ తో తిప్పికొట్టిన తీరు నాటి పోరాట యోధుల స్మృతి పథంలో చెరగని ముద్రలు వేశాయి. పురిటిబిడ్డను వదిలి ఉద్యమకార్యకర్తగా ఆమె సాగించిన గెరిల్లా పోరాటం, కొనసాగించిన అజ్ఞాతవాసం, ఆ తరువాత వరంగల్, ఔరంగాబాద్, హైదరాబాద్లలో మూడు సంవత్సరాలకుపైగా ఆరుట్ల కమలాదేవి అనుభవించిన జైలుజీవితం – పోరాట వటివులో ధైర్యసాహసాలలో ఆమెను మరో రూన్సీలక్ష్మిగా నిలబెట్టింది.
……
జైలునుండి విడుదల కాగానే 1952లో ఆలేరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఆమె ఘనవిజయం సాధించారు. ఆ తరువాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు అభ్యర్ధిగా ఎన్నికై పార్టీ శాసనసభాపక్షం ఉపనాయకులుగా (కామేడ్ పుచ్చలపల్లిసుందరయ్య నాయకులు) ఎన్నిక కావడం కమలాదేవి విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం. కమ్యూనిసు పార్టీలో చీలిక అనంతరం సిపిఐ శాసన సభాపక్షం నాయకురాలిగా కొనసాగారు. శాసనసభాపక్ష నాయకత్వం ఒక మహిళకు దక్కడం అదే మొదటిసారి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే ఆఖరిసారి కూడా, తన జీవిత కాలంలోనే స్త్రీ శక్తికి, విప్లవస్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం కమలాదేవిది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసినపుడు ప్రశంసాపత్రంలో ఆమెను అపరరుద్రమదేవిగా కీర్తించడంలో అతిశయోక్తి లేశమాత్రం కూడా లేదు. తెలంగాణా సాయుధ సమరం రోజులలో ఆమెచూపిన చొరవ, ధైర్యసాహసాలు ఆశ్చర్యం గొలిపేవి. విన్గవదీక్షలోను, కార్యాచరణలోనూ ఆమె కున్న-విశ్వాసం అనన్యసామాన్యమైనవి. పోరాట రంగంలో వీరవనితగాను, శాసనసభలో ప్రజాపాణిగా ప్రతిబింబించడంలోనూ, ఆ తరువాత మహిళా సమాఖ్య నాయకురాలిగా స్త్రీల సమస్యలపై కొనసాగించి పోరాటంలోనూ, ఆమె కనబరచిన దీక్షాదక్షతలు నేటితరానినే గాక భవిష్యత్ తరాలకు మార్గదర్శకం.
…..
ఆమె జీవితాంతం, ఆమె ప్రతిఘటన మరియు భావజాలం యొక్క స్ఫూర్తికి ప్రతి రూపం. ఆమె చేసిన కృషికి కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. 2001 జనవరి 1వ తేదీన ఒక గొప్ప విప్లవకారిని మరియు నాయకురాలు ఆరుట్ల కమలా దేవి మరణానికి సాక్ష్యమిచ్చింది, ఎల్లప్పుడూ న్యాయమైన మరియు సమానమైన సమాజం కోసం కలలు కనే కళ్ళు శాశ్వతంగా మూసుకు పోయాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed