తెలంగాణ రాష్ట్ర గాంధీ భవన్ లో బతుకమ్మ – దసరా పండుగల సందడి-చింతల నిర్మల రెడ్డి
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 25:తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో,నిర్మల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున,తెలంగాణ ప్రదేశ్ గాంధీ భవన్ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బందికి బతుకమ్మ,విజయదశమి సందర్భంగా కానుకలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళలకు నాణ్యమైన పట్టు చీరలు,పురుషులకు నగదు ను తెలంగాణ రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.తరువాత, నిర్మల రెడ్డి,నీలిమ కలిసి మహేష్ కుమార్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నిర్మల రెడ్డి మాట్లాడుతూ:-మనందరం ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ,దసరా పండుగల శుభాకాంక్షలు మీకు మీ ఇంటిల్లిపాదికి అందిస్తున్నాను.మనం బాగుండాలి… మనతో పాటు నలుగురూ బాగుండాలి అనేది నా నమ్మకం” అని పేర్కొన్నారు.