తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం
జూన్ 30:తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోనీ రాజకీయ సమీకరణలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు.ఆయన దృష్టి లో ఉంచిన పలు అంశాల పట్ల సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.అనంతరం జూలై 4వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించే గ్రామ అధ్యక్షుల బహిరంగ సభ సక్సెస్ కు సంబంధించిన పలు అంశాల గురించి వారు చర్చించినట్లు ఎమ్మెల్యే చెప్పారు