తప్పిన పెను ప్రమాదం, మంటల్లో దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు
అక్టోబర్ 22 మైలార్ దేవ్ పల్లి: రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవుపల్లి డివిజన్ లక్ష్మి గూడా జల్లపల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ హరి ప్రసాద్ అప్రమత్తమై స్కూల్ బస్సు రోడ్ పక్కన ఆపడం జరిగింది. పోగలు వస్తుండడంతో గమనించిన డ్రైవర్ బస్సును ఆపి దిగడంతో మంటలు పూర్తిగా అల్లుకపోయాయి, బస్సు పూర్తిగా కాలిపోయింది. ఫైర సిబ్బందికి ఫోన్ చేయడంతో సకాలంలో వచ్చి మంటలు ఆరిపారు కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో స్కూల్ పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఊపిరి పీల్చుకున్నారు. మైలార్ దవ్ పల్లి పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. (బస్ నెంబర్: టి ఎస్ 08 యు జి 8724) షార్ట్ సర్క్యూట్ కారణమని తెలిపారు పోలీస్ సిబ్బంది. ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉన్నది