జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు – నడికూడ శివకు ప్రచార బాధ్యతలు అప్పగించిన కిచ్చెన్న లక్ష్మారెడ్డి
నవంబర్ 04 హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు నడుమ కదలికలు చురుగ్గా సాగుతున్నాయి.అభ్యర్థి విజయం పార్టీ గౌరవ ప్రతిష్ఠలకు సంబంధించినదని భావించిన నేతలు,కార్యకర్తలు పగలు–రాత్రి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.ఈ నేపథ్యంలో సోమాజీగూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో కిచ్చెన్న లక్ష్మారెడ్డి కీలక నాయకులు,సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజల మేలు కోసం చేపట్టిన ఉచిత వైద్యం,గృహనిర్మాణం,రైతు బంధు,మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.ప్రతి బూత్ స్థాయిలో సమన్వయం కలిగి క్రమబద్ధంగా పనిచేయాలని కిచ్చెన్న ఆదేశించారు.ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు నడికూడ శివ,మల్లేష్ యాదవ్,అల్లే కుమార్‌లకు ప్రచార బాధ్యతలు అప్పగించారు.పార్టీ విజయమే ధ్యేయంగా కృషి చేయాలని కిచ్చెన్న పిలుపునిచ్చారు.