చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ నేత చేపంగి ప్రవీణ్ సంతాపం
నవంబర్ 03 చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తెల్లవారు జామున ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 21 మంది దుర్మరణం పాలైన దుర్ఘటనపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కాంటెస్టెడ్ ఎంపీటీసీ కోళ్లపడకల్ చేపంగి ప్రవీణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆయన,భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మృతుల కుటుంబాలకు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు అని చేపంగి ప్రవీణ్ తెలిపారు.