ఘనంగా శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం
జనవరి 20 బాలాపూర్: జనవరి 20న మాఘ శుద్ధ విదియ మంగళవారం రోజు* శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్బంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి దేవస్థానం నిర్మాణ ప్రాంగణం, దీన్ దయాళ్ నగర్ నందు వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. హోమం, అభిషేకం, పూజ కైoకర్యాలు, సామూహిక కుంకుమార్చన, అన్న ప్రసాద వితరణ ఉద్వాసన కుంకుమార్చనకు కావాల్సిన పూజా సామాగ్రి దేవస్థానం చే ఉచితంగా ఇచ్చారు. తదుపరి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది* ఆర్యవైశ్య బంధు మిత్రులు,మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులు, టెంపుల్ డైరెక్టర్లు, ఆలయ నిర్మాణ దాతలందరూ కార్యక్రమంనకు వచ్చేసి అమ్మవారి కరుణా కటాక్షలకు పాత్రులు కాగలరని మనవి.ముఖ్య గమనిక: అభిషేకం కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.అమ్మవారి సేవలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, RCI రోడ్, దీన్ దయాళ్ నగర్, మీర్పేట్, బాలాపూర్ మండల్.