ఘనంగా వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు కార్యక్రమం. పాల్గొన్న బిజెపి పార్టీ ప్రముఖ నాయకులు
నవంబర్ 22 మహేశ్వరం: వందేమాతరం జాతీయ గీతం 150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, తెలంగాణ భారతీయ జనతా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో బడంగ్ పేట్ లోని సిరిగిరి పురం యాదయ్య క్రీడా ప్రాంగణం లో కార్పొరేషన్ కి సంబంధించిన వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు హాజరయ్యారు. సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ “వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిన మహోగ్ర గీతం అని 150 ఏళ్ల తర్వాత కూడా అదే స్పూర్తిని నేటి యువతలో నింపే శక్తి దీనిలో ఉందని కొనియాడారు. జాతీయత, దేశభక్తి భావాలను బలోపేతం చేయడానికి బీజేపీ ప్రతిస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను, పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు నడికుడ యాదగిరి, రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు బంగారు అనిత ప్రభాకర్, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు రావుల మల్లేష్, మురళీధర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, తోట శ్రీనివాస్ రెడ్డి, రచ్చ లక్ష్మణ్, అసెంబ్లీ కో కన్వీనర్ సంతోష్, జగదీశ్వర్ రాజు, అంకంగారి శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ యాదవ్, మోర మహేందర్, అరవింద్, ప్రవీణ్ గౌడ్, కిరణ్ రాజ్, బంగారు రాహుల్, సంజయ్ కుమార్,భరత్ ముదిరాజ్, భువనచంద్ర మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.