ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి వేడుకలు….పాల్గొన్న జిల్లా బిజెపి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ మరియు శ్రీరాములు అందెల
సెప్టెంబర్ 25 మహేశ్వరం:మహేశ్వరం నియోజకవర్గ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు జయంతి వేడుకలు బిజెపి క్వాటర్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు, మరియు రంగారెడ్డి జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డి గారు హాజరై పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ చెట్ల మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం మన దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్న దీన్ దయాల్ గారి దృష్టి కోణం నేడు మరింత అవసరమని…ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు యువతలో పెంపొందించాలని.. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు బిక్షపతి చారి, బిజెపి ప్రధాన కార్యదర్శి సిద్దాల శ్రీనివాస్, కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మూర్చ నాయకులు సూల ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సోమేశ్వర్, బిజెపి సీనియర్ నాయకులు గాజుల మధు, మాజీ కార్పొరేటర్లు కరుణానిధి, రవి నాయక్, మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, గౌరీ శంకర్, కీసర హరినాథ్ రెడ్డి, చెవ్వ శ్రావణ్ కుమార్, భీమ్ రాజ్, నీలా రవి నాయక్, కాశీరాం, జగన్, కృష్ణ, సుధాకర్, రమేష్, సత్తన్న, వెంకటేష్, వేణుగోపాల్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్, అమర్నాథ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, మహిళా మోర్చా నాయకురాలు హైందవి రెడ్డి, లత శ్రీ, మల్లేష్, రఘు, వికీసాగర్, మల్లికార్జున్, శశి, ఆనంద్, నరసింహ, ప్రసాద్, నిఖిల్, భరత్, జెడి పవన్ తదితరులు పాల్గొన్నారు.