గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు వేగవంతం చేయండి–కమిషనర్ శశాంక్ ఆదేశాలు
డిసెంబర్ 01 మహేశ్వరం:రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక్ ఐఏఎస్ అధికారులు ఆదేశించారు.సోమవారం ఆయన రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ & కమిషనర్ డి.ఎస్. చౌహాన్‌లతో కలిసి అన్ని విభాగాల హెడ్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మిట్‌కి వచ్చే దేశీయ,అంతర్జాతీయ అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అందించేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.విద్యుత్, ఇంటర్నెట్,రవాణా,త్రాగునీరు,పారిశుద్ధ్యం, పార్కింగ్,హెలిప్యాడ్లు వంటి వ్యవస్థల్లో అంతరాయం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు.సమ్మిట్ రూట్ల వెంట పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని,చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని,మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు.సమీక్షలో ప్రోటోకాల్ సెక్రటరీ నర్సింహా రెడ్డి,హెచ్ఎంవీఎస్ఎస్బీ ఎండి కె.అశోక్ రెడ్డి,జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి,ఆర్ & బి,ఫైర్,ట్రాన్స్పోర్ట్,ఆర్టీసీ,టిజిఎస్పీడిసిఎల్, టూరిజం,ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.