గ్రామ ప్రజల సంక్షేమం కోసం దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన బూరుగుల నవీన్ కుమార్
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం,మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బూరుగుల నవీన్ కుమార్ మాట్లాడుతూ,గత సంవత్సరం నుండి అంబేద్కర్ కాలనీలో దుర్గామాత అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.ఈ సందర్భంగా రెండవ సంవత్సరంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించడం జరిగిందని,మొత్తం ఐదు సంవత్సరాల పాటు ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.గత సంవత్సరం తొలి పూజ నిర్వహించగా,ప్రస్తుత సంవత్సరంలో కూడా తొలి పూజ ఘనంగా నిర్వహించబడిందని,అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలందరికీ ఉండాలని బూరుగుల నవీన్ కుమార్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారు లావణ్య లింగం ముదిరాజ్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్,తెలంగాణ జాగృతి నాయకులు పల్నాటి నరేష్,ఆయిలా శివ గౌడ్,బొమ్మ దేవేందర్,కుండే వెంకటేష్,గాజులపల్లి నరసింహ,మాజీ వార్డు సభ్యులు తోట్ల నరసింహ,తోట్ల శ్రీకాంత్,గణపురం రాజు,గాజులపల్లి రాజు,మహేశ్వరం హరేందర్,నత్తి నరేందర్,గొల్లూరి నరేందర్,మైలా నరేష్,మహేశ్వరం శ్రీకాంత్,దారా సిద్ధులు,కొమ్ము అనిల్,దారా సురేష్,పసుపుల వెంకటేష్ తదితర నాయకులు, గ్రామ మహిళా భక్తులు, చిన్నారులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.