గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు: అజ్ఞానం నుండి జ్ఞానోదయం చేసే మార్గమే గురువు లక్ష్యం
మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 10 హైదరాబాద్: గురు పౌర్ణమి, గురు పౌర్ణమికి ఒక గొప్ప దినం దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గురువు అనుగ్రహం లేనిది ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు.. మనం ఏదైనా చేయాలి అనుకుంటే దానికి దైవ అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం ఉండాలి మనం చేసే పని సక్రమంగా జరగాలంటే గురువు గారి అనుగ్రహం వలన దానికి సరైన మార్గం ఏర్పడుతుంది. కార్యసిద్ధికి కార్యచరణం కార్యం నిష్టగా సాగాలని గురువు అనుగ్రహం ఎంతో ఉంది మనకు తెలియని విధివిధానాలు గురువుగారు అనుభవంతో మనకు చెప్పడం వల్ల సరైన మార్గం సరైన దృష్టి మనకు కార్యంపై ఏర్పడుతుంది. భారతదేశానికి గొప్ప గొప్ప గురువు లు ఉన్నారు ద్రోణాచార్య ఆచార్య చాణిక్యులు ప్రతిరోజు తెలుగు దుబాయ్ రాష్ట్రాలకు ప్రవచనాలు అందించే మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక మరియు జీవితంలో ఎలా బతకాలి అని ప్రతిరోజు మనకు వారి మాటల ద్వారా వివరిస్తూనే ఉంటారు. గురుభక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏకలవ్యుడు గురువు బొమ్మని పెట్టుకొని బాణం గురిపెట్టడం నేర్చుకున్నాడు. అందాకారం లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చే ఒక గొప్ప సాహసమే గురు అనుగ్రహం. మనకి జ్ఞాన దయం చేసి చీకటి బ్రతుకులు నుండి వెలుగు లోకి తీసుకొచ్చే మంచి మాటలు గురు యొక్క లక్షణం.