February 22, 2026

కూకట్పల్లిలో రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రూ. 60.5 లక్షల వ్యయంతో రోడ్డు పనులకు అంచనాలు – త్వరలో పనులు ప్రారంభం:టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్

0
IMG_20260111_141804

కూకట్ పల్లి, వసంత నగర్ డివిజన్:టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పర్యటనలో భాగంగా NRSA కాలనీ, డైమండ్ హిల్స్, CBCID కాలనీలను సందర్శించడం జరిగింది. సందర్భంగా ఆయా కాలనీల వాసులు తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని బండి రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ ప్రజల అభ్యర్థన మేరకు, రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా బండి రమేష్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇంజనీరింగ్ అధికారుల ద్వారా రోడ్ల పనుల కోసం వర్క్ ఎస్టిమేషన్లు వేయించడం జరిగింది.
అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:

  • CBCID కాలనీ రోడ్డు పనులకు – రూ. 25 లక్షలు (అనుమతి మంజూరు)
  • NRSA కాలనీ & డైమండ్ హిల్స్ రోడ్డు పనులకు – రూ. 35.5 లక్షలు
    ఇంజనీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు పిలిచి, రోడ్డు పనులు ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది.

👉ఇదివరకే గోపాల్ నగర్‌లో రూ. 80 లక్షల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభం కాగా,
👉డైమండ్ హిల్స్ ప్రాంతంలో ఐమాక్స్ లైట్లు, వీధి దీపాల ఏర్పాటు విషయం అందరికీ తెలిసిందే.

ఈ అభివృద్ధి పనులన్నీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనం.

ప్రజా పాలన – ప్రజా ప్రభుత్వం – ఇది కాంగ్రెస్ ప్రభుత్వం

ఈ సందర్భంగా కూకట్పల్లి ప్రజల తరఫున బండి రమేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు

కూకట్పల్లి వైస్ చైర్మన్ లక్ష్మయ్య గారికి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు*💐💐💐💐🎉 🎉 🎉

ధన్యవాదాలతో,

మీ గాదె శివ CA, MBA
వసంత నగర్ డివిజన్
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed