February 22, 2026

కాటేదాన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు.ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

0
IMG-20260113-WA1568

జనవరి 13 మైలార్ దేవ్ పల్లి: రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధి మైలార్డెవపల్లి డివిజన్ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మైలార్డెవపల్లి డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. ముగ్గుల పోటీలు సందర్భంగా మన సంప్రదాయాలను గౌరవిస్తూ, మహిళలు అత్యంత ఉత్సాహంతో ఈ పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి.. ముగ్గల పోటీలో పాల్గొన్న అందరికి కార్తీక్ రెడ్డి గారు బహుమతులు అందిచడం జరిగింది..అత్యుత్తమ ముగ్గులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల జీవితంలో నిత్యం వెలుగు వెరిజిల్లాలని ఆ దేవుని కటాక్షం ప్రజలపై ఉండాలని, ఆనందంగా పండగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధముగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల వెంకటేష్ ను అభినందించారు. బహుమతులు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు,. మరియు మహిళా సోదరీమణులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలన్ సుభాష్ రెడ్డి, డి. రమేష్ ముదిరాజ్, నోముల రాము యాదవ్, అక్కేమ్ రఘు యాదవ్, బండ రాజేష్ యాదవ్, కే. లక్ష్మీ, సరిత, భూదేవి రెడ్డి, సుగుణమ్మ, లక్ష్మి ప్రసన్న. పుష్ప, లలిత, మైసిరెడ్డి, గంజి రాజు, సమ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎర్లపల్లి ప్రవీణ్, మహేందర్ ముదిరాజ్, కొంపల్లి జగదీష్ నరేష్ యాదవ్, అశోక్, నానీ, మధు చారి కృష్ణ ముదిరాజ్, నాయకులు కార్యకర్తలు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed