కవి కోకిల జాషువా జయంతి నివాళి నేడు (అంటారని తనముతో ఆకలి దప్పులతో పోరాడి గెలిచిన వ్యక్తి)
Oplus_131072
సెప్టెంబర్ 28 హైదరాబాద్:మన జాషువా 1895 సంవత్సరం సెప్టెంబరు 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించి, అంటరానితనంతో, ఆకలిదప్పులతో పోరాడి, గెలిచి, సాహితీ క్షేత్రంలో కృషీవలుడై “కృషితో నాస్తి దుర్భిక్షం ” నానుడిని సార్ధకం, యదార్థం చేశారు. ఉపాధ్యాయుడుగా, తెలుగు పండితుడుగా, మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా, ఊరూరా తిరిగి పొట్టపోసుకుంటూ, పెద్దల (కందుకూరివీరేశలింగం, తిరుపతి వెంకట కవులు) ఆశీర్వాదాలు మన్ననలు పొంది 1956-1960ల మధ్య ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు కార్యక్రమాల నిర్మాతగా కవికోకిలయ్యారు. కవితా విశారద బిరుదును కైవసం చేసుకున్నారు. తరువాతి కాలంలో కళాప్రపూర్ణుడై, పద్మభూషణుడై, జాషువా 1971 జూలై 24న మనకు యెనలేని సాహితీ సంపద వదలి వెడలిపోయి, మన గుండెలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.