December 24, 2025

కరీంనగర్‌లో సీసీఎస్ పోలీసుస్టేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్

0
IMG-20251028-WA0120

అక్టోబర్ 27 కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ గారు ఈ రోజు (27-10-2025) సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుస్టేషన్ కార్యాలయం యొక్క నూతన భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఇంతకుముందు కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ భవనం పైన పనిచేసిన సీసీఎస్ పోలీసుస్టేషన్‌ను, కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం ఐపీఎస్ గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ, నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీసు స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. సీసీఎస్ పోలీసుస్టేషన్ సేవలు పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా నేరస్థులను పట్టుకోవడంలో వారి సహకారం ఎంతో ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
నూతన భవనంలోకి సీసీఎస్ కార్యాలయం సేవలను సీపీ గారు అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్ లతో పాటు సీసీఎస్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed