కపూర్..సో ప్యూర్..
(కపూర్ జయంతి)
14.12.1924
ఆయన జీవితం
భారతీయ సినిమా గమనం..
ఆయన ప్రయాణం
బాలీవుడ్ సినిమా
సక్సెస్ మంత్రం..
ఆయన సినిమా కళ..
ప్రేమ..విషాదం..
వినోదం..
టెక్నిక్…
దేశం..సందేశం..
భావావేశం..
సంగీతం..
సాహిత్యం..
అన్నిటి మేళవింపు..
ఇక ఆయన..
దర్శకుడు..నిర్మాత..
స్టూడియో అధినేత..
హీరో..కమెడియన్..
క్యారెక్టర్ నటుడు..
సహాయ నటుడు..
సినిమా నిర్మాణంలో
ప్రమేయం ఉన్న
అన్ని విభాగాలపైనా
పట్టున్న దిగ్గజం..
చార్లీ చాప్లిన్ ఆఫ్ ఇండియా..
ఆయన కుటుంబం
కళాకారుల మేళా..
నటుల కుంభమేళా..
రాజ్ కపూర్..
The real show man
Of indian cinema..
అలాంటి గొప్ప వ్యక్తి
జయంతి ఈరోజు..
మరి అంతటి మహా కళాకారుడి గురించి
మనకి తెలిసిన విషయాలను
ఓ కవిత రూపంలో
రాయకపోతే ఎలా..
ఈ క’పూర్’..వెరీ రిచ్!
మేరా జూతా హై జపానీ..
ఏ ప్లాటూన్ హిందుస్తానీ..
సర్ పే లాల్ టోపీ రూసీ..
ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ..
తనని తాను ఇంత గొప్ప
విశ్వమానవుడిగా..
అంత చక్కటి
దేశభక్తుడిగా ఆవిష్కరించుకున్న నటుడు..
జీనా యహా మర్నా యహా
ఇస్కే సివా జానా కహా..
ఇంత చిక్కటి వేదాంతాన్ని
కాచి వడబోసి తాను జోకరై
ప్రదర్శించిన దార్శనికుడు..
జిస్ దేశ్ మె గంగా బెహతీ హై
హమ్ ఇస్ దేశ్ క వాసీ హూ..
హమ్ ఇస్ దేశ్ క వాసీ హూ..
గంగ ఉత్తుంగతరంగ అయి
ప్రవహించే దేశం నాదని
సగర్వంగా ప్రకటించిన
భారతీయుడు..
సత్యం శివం సుందరం..
ఇలా ఎత్తుకుని
సౌందర్యంలోని మర్మాన్ని
విడమరచిన పిపాసి..
ఇదంతా రాజ్ కపూర్ వాసి!
భారతీయ సినిమా ఉన్నతికి
ఆ షోమాన్ హస్తవాసి!!
ఆయనలోని కళాత్మకతను..
జాతీయ భావనలను కలబోసి..
అనుభవాలు
కాచి వడబోసి!!!
ఒకనాడు..సోవియెట్ రష్యా
మన మిత్రదేశం..
ఇండియా గురించి
మీకేం తెలుసన్న ప్రశ్నకు..
తెల్లని ఆ పౌరుల
చల్లని జవాబు..
ఇండియా అంటే
జవహర్ నెహ్రూ..
రాజ్ కపూరని..
అది..అది..
ఈ ఆవారా జగతికి
వేసిన దండోరా!
ఎన్నో సినిమాలు…
ప్రతీదీ కళాఖండం కాకపోయినా
దేనికదే అఖండం..
సంగం..ఆవారా..
శ్రీ 420..మేరా నామ్ జోకర్
బాబీ..సత్యం శివం సుందరం
కల్ ఆజ్ ఔర్ కల్..
చూస్తుంటేనే అదోలాంటి అనుభూతి…
ఆ మోమున
అంతులేని సానుభూతి..
ప్రస్ఫుటంగా పరిణితి..
చార్లీ చాప్లిన్ ప్లాన్..
విషాదంలో హాస్యం..
నవ్విస్తూనే అంతలో కన్నీరు
అదే రాజ్ కపూర్ మార్కు..
అద్భుతమైన
ఆయన స్పార్కు!!
కపూర్ ఇల్లు..
పెద్ద నటనాలయం..
అంతకు మించిన ప్రేమాలయం..
పెద్దాయన
పృథ్వీరాజ్ మొదలు..
మనవరాళ్లు
కరిష్మా..కరీనా…
మనవడు రన్భీర్ వరకు..
ఇంట్లో ఉన్నోళ్లు కాక
ప్రేమనాథ్ సోదరులు..
ప్రేమ్ చోప్రా..
అనిల్ కపూర్ బ్రదర్స్..
కొంచెం దూరంగా బిగ్ బి..
బాలీవుడ్ అంతా బాబీ..భాయ్..
అప్పుడప్పుడూ హై చాయ్..
డిసెంబర్ 31 రాత్రి
గొప్పగా నయాసాల్ పండగ..
రాజ్ కపూర్ ఉండగా..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286