February 22, 2026

ఇండియాకు శివరాత్రి… పాకిస్తాన్ కు కాలరాత్రి.. భారత్ చేతిలో పాకిస్తాన్ ఘనపరాజయం

0
IMG-20260215-WA3062

హైదరాబాద్ ఫిబ్రవరి 16: ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు కొలంబోలోని ప్రేమ దాస స్టేడియంలో భారత్ పాక్ మధ్య జరిగిన క్రికెట్ లీగ్ మ్యాచ్లో భారత్ చేతిలో చావు దెబ్బతిని ఘోర పరాజయాన్ని పాకిస్తాన్ స్వీకరించింది. మ్యాచ్కు ముందు ప్రగల్బాలు పలికిన పాక్ కెప్టెన్ సల్మాన్ అగ అభిషేక్ను డెకౌట్ చేస్తామని అన్న మాటను నిలబెట్టుకున్నాడు.. అంతవరకు బాగానే ఉంది భారత్లో మిగతా పది సింహాల గురించి తక్కువ అంచనా వేశాడు.. ప్రపంచ దేశాలే భారత్తో గెలిస్తేనే కప్పు అందుకోగలమని నెత్తినూరు మొత్తుకుంటుంటే ..వీళ్ళు మనమీద గెలస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు ..ఎలాగో మ్యాచ్ ఆడమని తప్పించుకుందామని చూశారు.. ఏం చేస్తాం పాకిస్తాన్ కర్మ ఆ విధంగా తెల్లారింది ..ఈ ఘోర పరాజయాన్ని కనులారా చూసి ఆనందిద్దామని పిసిబి చైర్మన్ నక్కలాంటి నక్వి ఎగేసుకొని మరి శ్రీలంకలోని ప్రేమ దాస స్టేడియం కు చేరుకున్నారు .మ్యాచ్ ను వీక్షించాడు. 200 పైన పరుగులు రావాల్సింది భారత్కు కానీ ..175 పరుగులు చేసింది .ఇసాన్ కిసాన్ 77 పరుగులు చేశాడు. కిసాన్ దెబ్బకు పాక్ బౌలర్లు తల్లడిల్లిపోయారు.. గత మ్యాచ్లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ వికెట్ పడినప్పుడు ఎటకారంగా కనుసైకి చేశాడు.. దానికి బదులుగా ఈరోజు అబ్రార్ ని ఇసాన్ కిసాన్ కోసి మిరప్పొడి పెట్టాడు .ఇది చాలు ఈ రాత్రంతా పాకిస్తాన్ కు నిద్ర పట్టదు. ఒక విధంగా చెప్పాలంటే భారత్కు శివరాత్రి ..పాపం పాకిస్తాన్కు కాలరాత్రి .. అని చెప్పొచ్చు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మేకపోదు గాంభీర్యం ప్రదర్శించడం పాకిస్తాన్ ఆపేయాలి .చివరకు కేవలం 114 పరుగులకే పాకిస్తాన్ తోక ముడిచి 62 పరుగుల తేడాతో ఘనపరాజయాన్ని అందుకుంది

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed