ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. పరీక్షలో మార్పులు
Oplus_0
జూలై 25 హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల విషయంలో పలు మార్పులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇప్పటివరకు సైన్స్ గ్రూపులకు మాత్రమే పరిమితమైన ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఇకపై ఆర్ట్స్ గ్రూపులకు, భాషా సబ్జెక్టులకు కూడా ఇవ్వాలని తెలిపింది. 80 మార్కులకు పరీక్ష నిర్వహించి.. ప్రాజెక్టు కింద 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.