ఆదాయానికి మించిన ఆస్తులు.. ACB అదుపులో మురళీధర్ రావు
జూలై 15 హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ENC మురళీధర్ రావును ACB అదుపులోకి తీసుకుంది.
బంజారాహిల్స్లోని నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ మురళీధర్ను పలుమార్లు విచారించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈయన 2024 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు.