అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మంత్రి సీతక్క గారిపై, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోకన్నగారిపై తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నమస్తే తెలంగాణ పత్రికకు నిప్పoటించిన ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య..
జూలై 02: అనగా బుధవారం రోజున మంగపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య గారు విచ్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న brs సొంత పత్రిక నమస్తే తెలంగాణ పత్రికను కాల్చారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…గత రెండు మూడు రోజులుగా brs సొంత పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక లో ప్రచురిస్తున్నటువంటి తప్పుడు వార్తలను మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం, అదేవిధంగా మా నాయకుడు నిత్యం అనుక్షణం ప్రజాహితమై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతిక్షణం రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి దృష్టికి తీసుకెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తు, గత శాసనసభ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలను తన బుజస్కందాలపై వేసుకొని అత్యధిక మెజారిటీతో అభ్యర్థులను గెలిపించి నిత్యం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపితానికి కృషి చేస్తూ సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అందర్నీ సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తనదైన శైలిలో ప్రతి గడపగడపకు వాడవాడనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో నిత్యం చర్చించి ప్రజలందరికీ అందే విధంగా ప్రణాళికలను చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని 100% విజయతీరాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తున్న మా నాయకుడి పై ఎవరో ఆకాశ రామన్న (నాగన్న) పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న గారిపై తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ పేపర్ యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర వహించాలి ( ప్రజా సమస్యలను ప్రభుత్వానికి సూచన చేసే విధంగా ఉండాలి తప్ప ) ప్రజా నాయకులపైన బురద జల్లలి అనే చిల్లరా రాజకీయాలు మానుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ కార్యక్రమం లో…
- జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా కార్యదర్శి తుడి భగవాన్ రెడ్డి, బీసీ సెల్ ఉపాధ్యక్షులు పెద్ది నరసింహరావ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హీదాయ తుల్లా,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, intuc మండల అధ్యక్షులు తిరుపతి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షులు సయ్యద్ హుసేన్,
- మండల సీనియర్ నాయకులు..
- కాకర్ల శ్రీనివాస్, ఎర్రంగారి సురేష్, బసరికాని హరికృష్ణ, బోడ బొర్రయ్య, పైగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఎడ్ల నరేష్,బోడ రామచంద్ర, ఏంపల్లి విరస్వామి, మూగల చంటి,బసరికాని నాగార్జున, గజర్ల రాజు, మద్దెల ప్రవీణ్, మెడిద సతీష్, భూక్యా కుమార్,దుర్గం ప్రసాద్, బిల్పటి నరేష్, గద్దల సాయి, రవి, తదితరులు పాల్గొన్నారు….