అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్. కృష్ణయ్య ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేశారు
అక్టోబర్ 15 హైదరాబాద్: అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం (International Allied Healthcare Professionals Day) సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్. కృష్ణయ్య గారు అనుబంధ ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన “ది అనాటమీ ఆఫ్ అవేర్‌నెస్” (The Anatomy of Awareness) అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు
1)2021లో ఏర్పడిన NCAHP చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలి.రాష్ట్ర స్థాయి Allied Healthcare Council ఏర్పాటు చేయాలి.
2)నకిలీ, గుర్తింపు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలి.నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలి కట్టిన డబ్బు వాపస్ ఇవ్వాలి.
3)Allied Healthcare Professionals (paramedical)కోసం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
4)ప్రైవేట్ రంగంలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతా చట్టాలు తీసుకురావాలి.
5)ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పారామెడికల్ ఎంప్లాయిస్ కి 30,000 బేసిక్ ఉండేలాగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి.
6)పారామెడికల్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు తక్షణం విడుదల చేయాలి.
ఆయన ప్రభుత్వాన్ని కోరారు
అలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫౌండర్ జనరల్ సెక్రెటరీ కురుమళ్ళ వంశీ ప్రసాద్ మాట్లాడుతూ “ది అనాటమీ ఆఫ్ అవేర్‌నెస్” ప్రధాన కారణం ఈ ఫేక్ కాలేజీలో జాయిన్ అయి ఇబ్బంది పడుతున్న పిల్లల కోసమే ఈ యొక్క బుక్కు ప్రిపేర్ చేయడం జరిగింది.
ఎన్నోసార్లు మంత్రిగారికి సంబంధిత అధికారులకి కూడా ఈ యొక్క ఫేక్ కాలేజీల మీద రిప్రజెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదే కాలేజ్ యజమానికి మళ్ళీ డిప్లమా కాలేజెస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్న నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయకపోతే.ప్రభుత్వం లోనే ఉన్న అధికారులు కోర్టు బోనులో నిలబడవలసి ఉంటుందని
ఉచితాల మీద ఉన్నంత శ్రద్ధ ప్రభుత్వాలకి విద్యార్థుల మీద లేదని విద్యార్థుల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాలు కూడా గాల్లోనే కలిసిపోతాయి అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ కన్వీనర్ డా. సంజీవ్ సింగ్ యాదవ్, తెలంగాణ పారామెడికల్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు యం.శ్రీనివాస్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్/సెక్రటరీ ప్రశాంత్ కుమార్, తెలంగాణ బీసీ యువజన ప్రధాన కార్యదర్శి శివరాం ప్రసాద్, అలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు యం.రాము, కోశాధికారి వై.వెంకటేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రజిని,ఉపాధ్యక్షులు అథెర్, రాజా గౌడ్, పవన్, సంయుక్త కార్యదర్శులు విశ్వనాథ్,శ్రీకాంత్,సత్యం, అజయ్ తదితరులు పాల్గొన్నారు.