హైదరాబాద్ శాంతి సందేశానికి గౌరవం – జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు.
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి కి గ్లోబల్ పీస్ అవార్డు–2025 లభించింది.ఆదివారం తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జంగారెడ్డికి ఈ అవార్డు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ప్రసంగించిన జంగారెడ్డి విద్యార్థులు,యువత హింసను విడిచి శాంతి మార్గంలో నడిచి దేశ సమైక్యత,రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ నగరం శాంతి,సామరస్యానికి ప్రతీక.కుల మత భేదాలు మరచి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలి అని అన్నారు.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డా. రాజనారాయణ ముదిరాజ్ తన సందేశంలో గాంధీ ఆలోచనలను అనుసరించడం ద్వారానే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు.మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ కృష్ణ నాయక్,జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి,కాంగ్రెస్ నాయకులు రాకేష్ గౌడ్,జి.వేణుగోపాల్,బిచ్చుకారి సూర్య,ఢిల్లీ శివకుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.వివిధ మండలాల నుంచి విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై జంగారెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించి అభినందించారు.