లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి నేడు. (జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన గొప్ప మహానుభావుడు)
Oplus_131072
అక్టోబర్ 2 హైదరాబాద్:జాతికి ‘ జై జవాన్..జై కిసాన్ ‘ నినాదం ఇచ్చిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి…
జయంతి ఈరోజు.!భారత దేశ మొదటి ప్రధాని నెహ్రూ కు వారసుడి గా ఆయన తర్వాత ప్రధానిగా పనిచేసిన భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎంత చెప్పినాతక్కువే..!శారీరకంగా పొట్టిగా,బలహీనంగా కనబడే.. శాస్త్రి గారు..కడు పేదవాడు.అంటే శారీరకంగానే కాదు
ఆర్థికంగా కూడా బలహీనుడన్న మాట..అయితే మానసికంగా మాత్రం ఎంతో దృఢంగావుండేవాడు
ఆయన మేధాశక్తి అపారం.దూరదృష్టి, అంకిత భావం,పట్టుదల ఆయన సొంతం.ఉన్న వూరిలో చదువుకోడాని బండిలేకపోతేగంగా
నది దాటివెళ్ళి చదువుకునేవాడు.ఒక్కోసారి పడ
వ వాడికి ఇవ్వటానికి డబ్బులులేక , పడవ వాడిని
అడగటానికి అభిమానం అడ్డువచ్చిపుస్తకాల్నితన
చొక్కాలో చుట్టి వీపుకు తగిలించుకొని ప్రాణాలర
చేత పట్టుకొని గంగానది అవతలి ఒడ్డుకు ఈదు
కొని వెళ్ళేవాడు. శాస్త్రి గారు వ్యక్తిత్వంలో అభి
మాన ధనుడు.
ప్రధాని కాకముందు అలహాబాద్ లో అలహాబాదు
ఇంప్రూవ్మెంట్ సొసైటీ కి ట్రస్టీ గా వుండేవారు.ఆయ
న ఊర్లో లేనపుడు అతని స్నేహితుడొకడు అధికా
రులతో మాట్లాడి వేలానికి పెట్టిన భూమిలో వేలం లేకుండా ట్రస్టీలందరికీ తలోప్లాటు తీసుకున్నారు.
పనిలో పనిగా శాస్త్రిగారికి కూడా ఓ ప్లాటు తీసుకు
న్నారుఈ విషయం తెలుసుకున్నశాస్త్రిగారుమితృ
ని తీవ్రంగా మందలించారు.ట్రస్టీలుతీసుకున్నప్లాట్ల
ను తక్షణం రద్దు చేశారు.!
ప్లాట్లు కావాలనుకునే ట్రస్టీ లు తమ పదవులకు రాజీనామాచేసి వేలంలో పాల్గొనాలని సూచించా
రు.తన పేర వున్న ప్లాటుని తిరిగిఇచ్చేశారు..తను
దేశప్రధానిగా వున్నా, తనకుమారులనుసిటీబస్సు
ల్లోనే ప్రయాణించమన్న అతి నిరాడంబరుడు.ఒక
సారి తనకు తెలియకుండా తను వాడే….ఆఫీసు
కారుని తన కుమారులు వ్యక్తిగత పనులకు వాడి
నట్లు తెలుసుకున్న శాస్త్రిగారు తరువాతి రోజు వారు తిరిగిన దూరాన్ని లెక్కకట్టి ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో జమ చేయించిన నిజా
యితీపరుడు .
తన మొదటి కుమారుడు ఒక పెద్ద సంస్థలోఉద్యో
గంచేస్తూ అకస్మాత్తుగా ప్రమోషనుపొందితేఆసంస్థ
తననుంచి ఏదో సహాయం ఆశించి సదరు ప్రమో
షన్ ఇచ్చి ఉంటారనే ఉద్దేశంతో తన కుమారుడిని ఆ సంస్థ నుండి రాజీనామా చేయించిన చండశాస
నుడు.
పాకిస్తాన్ తో యుద్ధ విరమణఒప్పందానికితాష్కెం
ట్ (రష్యా ) వెళ్ళి ఒప్పందం పై సంతకాలు చేసిన మర్నాడే ..(11 – 1 – 1966 ) అక్కడే హృద్రోగంతో మరణించారు లాల్ బహదూర్ శాస్త్రి..!
దేశంలో పేదరికం పోవడానికి స్తోమతగలవారం
తా సోమవారం ఒకపూట భోజనం మానేయాలని.
అలా పేదవారికి ఓ పూట భోజనం మిగిల్చేలా..
చేయాలని కోరడమే కాకుండా,తాను స్వయంగా ఆచరించి చూపిన మహనీయుడు.
జై జువాన్..జైకిసాన్ నినాదమిచ్చి స్ఫూర్తిని రగిలించినకార్యశీలి, స్ఫూర్తి ప్రదాత…..మన శాస్త్రి గారు.
దేశానికి ప్రధాని అయినా…ఆఖరి వరకూ కూడా సొంత ఇల్లు లేని అతి సామాన్యుడు.
రైలు ప్రమాదం జరిగితే..రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామాచేశారు శాస్త్రి గారు.
ఇలాంటి గొప్ప వ్యక్తి ఒకప్పుడు ఈ నేలమీద వున్నాడా?అంటే ఆశ్చర్యం అనిపించినా…..ఇది నిజం.
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు..!!
*ఎ.రజాహుస్సేన్..!!